పెర్త్: ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో ఆటగాళ్ల గాయాల బెడడ తప్పటం లేదు. రొజుకొకరు చొప్పున గాయపడటం ఇరు జట్లను కలవరపెడుతోంది. తొలి రోజు కివీస్ బౌలర్ ఫెర్గుసన్ గాయంతో ఈ టెస్టుకు దూరం కాగా.. రెండో రోజు ఆసీస్ బౌలర్ హేజిల్‌వుడ్ గాయంతో ఈ సిరీస్‌కే దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. తాజాగా మూడో రోజు ఆటలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఈ మ్యాచ్‌కు అంపైర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పాకిస్తాన్ సీనియర్ అంపైర్ అలీమ్ దార్ గాయపడ్డాడు. గాయంతో విలవిల్లాడిన ఆయన మైదానంలో కుప్పకూలాడు. అలీమ్ దార్‌కు గాయం జరిగిన తీరు చూశాకా ఈ టెస్టుకు దూరమయ్యే అవకాశాలు కనిపించాయి. అనంతరం ఫిజియో వచ్చి ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం తిరిగి అంపైరింగ్ చేశాడు. దీంతో కథ సుఖాంతమైంది.
అసలేం జరిగిందంటే?
ఆస్ట్రేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా టిమ్ సౌథీ వేసిన బంతిని మార్నస్ లబుషేన్ డిఫెన్స్ ఆడాడు. ఇదే సమయంలో మరో ఎండ్‌లో ఉన్న నాన్ స్ట్రైకర్ బర్న్స్ సింగిల్ తీసే ప్రయత్నంలో సగం క్రీజు వరకు వెళ్లాడు. ఈ క్రమంలో బంతి అందుకున్న బౌలర్ టిమ్ సౌథీ వికెట్లపై విసిరాడు. ఆ బంతి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో అలీమ్ దార్, ఇదే క్రమంలో ఆ బంతిని అందుకోవాలని కివీస్ ఆల్‌రౌండర్ సాంట్నర్ చేసిన ప్రయత్నంలో వీరిద్దరూ ఢీ కొట్టకున్నారు. అయితే సాంట్నర్ అలీమ్‌ను తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ కుదర్లేదు. చికిత్స అనంతరం అలీమ్ దార్ అంపైరింగ్ చేయడంతో ఆటగాళ్లు ఊపిరి పీల్చుకున్నారు.
చదవండి:
‘400 నాటౌట్.. 434 ఛేజింగ్ చూశా’
మూర్ఖులు అర్థం చేసుకోలేరు
Comments
Please login to add a commentAdd a comment