చెన్నై: భారత కెప్టెన్ విరాట్ కోహ్లిలా వెస్టిండీస్ ప్లేయర్లు కూడా చెమటోడ్చాలని ఆ జట్టు సహాయ కోచ్ రాడీ ఎస్ట్‌విక్ అన్నాడు. శుక్రవారం అతను మీడియాతో మాట్లాడుతూ ‘హెట్‌మైర్, నికోలస్ పూరన్, హోప్‌లాంటి యువ క్రికెటర్లు ప్రత్యర్థి కెప్టెన్ కోహ్లిని చూసి నేర్చుకోవాలి. ఆట కోసం అతను ఎంతో శ్రమిస్తాడు. నిత్యం జిమ్‌లో కసరత్తు చేస్తాడు, నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తాడు. కఠోరంగా శ్రమించేతత్వానికి అతనే ఓ నిదర్శనం. కుర్రాళ్లంతా అతన్ని అనుసరించాల్సిందే. కష్టపడితేనే విజయమైనా... ఏదైనా... లేదంటే ఏదీ రాదు’ అని ఎస్ట్‌విక్ అన్నాడు. టి20 సిరీస్‌లో రాణించినట్లే ఈ వన్డే సిరీస్‌లోనూ తమ జట్టు రాణిస్తుందని చెప్పాడు. తమ కుర్రాళ్లకు ఈ పర్యటన ఓ పాఠంలా పనికొస్తుందన్నాడు. విండీస్ పొట్టి ఫార్మాట్‌లో 1–2తో సిరీస్‌ను కోల్పోయింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం ఇక్కడ తొలి వన్డే జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment