
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. విండీస్ ఆల్‌రౌండర్ జాసన్ హోల్డర్, కింగ్ కీలక పాత్ర పోషించారు. 104 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ ఒకే ఒక వికెట్ కోల్పోయి చేధించింది. విండీస్ బ్యాటర్లలో కింగ్(52), షాయ్ హోప్(20) పరుగులతో రాణించారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 103 పరులకే కుప్పకూలింది. ఆరంభం నుంచే విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ విలవిలాడింది.
కేవలం 41 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. చివర్లో రషీద్(22),జోర్డాన్(28) పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్ ఆ మాత్రం స్కోరైనా సాధించ గల్గింది. కాగా హోల్డర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో జోర్డాన్(28), రషీద్(22) టాప్ స్కోరర్‌లగా నిలిచారు. కాగా యాషెస్ సిరీస్ కోల్పోయిన ఇంగ్లండ్‌కు మరో ఎదురు దెబ్బ తగిలినట్లైంది.
Comments
Please login to add a commentAdd a comment