Wi Vs Eng T20 Series: వెస్టిండీస్ కెన్సింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్( 5వ టీ20)లో వెస్టిండీస్ 17 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 5 టీ20ల సిరీస్‌ను 3-2తో విండీస్ కైవసం చేసుకుంది. కాగా అఖరి ఓవర్‌లో వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు పడగొట్టి జాసన్ హోల్డర్ విండీస్‌కు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక 180 పరుగల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం 162 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లు హోల్డర్(5), అకేల్ హోసేన్(4) వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జేమ్స్ విన్స్(55), బిల్లింగ్స్(41) టాప్ స్కోరర్‌లుగా నిలిచారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 179 పరుగులు చేసింది. వెస్టిండీస్ బ్యాటర్లలో కెప్టెన్ పొలార్డ్(41), రోవ్‌మన్ పావెల్(35), బ్రాండన్ కింగ్(34) పరుగులతో రాణించారు. కాగా ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డులు హోల్డర్‌కి దక్కాయి.
చదవండి: జట్టు సీఈవోతో గొడవ.. ఏకంగా కెప్టెన్సీ నుంచే తీసేసారు!
The 1st West Indian to take a T20I hat-trick! Jason Holder's performance takes our #MastercardPricelessMoment. #WIvENG pic.twitter.com/VwTp1qcYlV
— Windies Cricket (@windiescricket) January 31, 2022
Comments
Please login to add a commentAdd a comment