విండీస్‌తో మూడో టి20కి సిద్ధార్థ్‌ కౌల్‌  | India vs West Indies: Siddarth Kaul returns as India | Sakshi
Sakshi News home page

విండీస్‌తో మూడో టి20కి సిద్ధార్థ్‌ కౌల్‌ 

Published Sat, Nov 10 2018 2:10 AM | Last Updated on Sat, Nov 10 2018 2:35 AM

T20 match against West Indies in Chennai - Sakshi

వెస్టిండీస్‌తో ఆదివారం చెన్నైలో జరుగనున్న ఆఖరి టి20 మ్యాచ్‌ నుంచి టీమిండియా పేసర్లు జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌ యాదవ్, స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌లకు విశ్రాంతి ఇచ్చారు. రానున్న ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందు ఈ ముగ్గురికి తగినంత విశ్రాంతి కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి తెలిపారు. పంజాబ్‌ పేసర్‌ సిద్ధార్థ్‌ కౌల్‌ను జట్టులోకి తీసుకున్నారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే 2–0తో నెగ్గిన విషయం తెలిసిందే. కౌల్‌ ఈ ఏడాది ఐర్లాండ్‌పై టి20 అరంగేట్రం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement