ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. బ్రిస్టల్‌లోని పబ్ బయట ఒక వ్యక్తిపై పిడిగుద్దులు కురిపించిన ఘటనకు సంబంధించి పోలీసులు స్టోక్స్‌ను అరెస్ట్ చేసి రాత్రంతా జైల్లో ఉంచారు. విచారణ అనంతరం అతడిని విడుదల చేశారు. సహచర క్రికెటర్ అలెక్స్ హేల్స్ కూడా స్టోక్స్‌తో పాటు ఉన్నాడు. విండీస్‌తో మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం అనంతరం సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఒక నిమిషంలో స్టోక్స్ పదిహేను పిడిగుద్దులు కురిపించి సదరు వ్యక్తి తీవ్ర గాయాలు కావడానికి కారణమయ్యాడు. దీనికి సంబంధించిన వీడియా ఇప్పుడు వైరల్ అయ్యింది.