
వెస్టిండీస్ 234 ఆలౌట్
వెస్టిండీస్తో తొలి టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా బుధవారమిక్కడ ఆరంభమైన తొలి టెస్టులో కరీబియన్లును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన విండీస్ను భారత బౌలర్లు 234 పరుగులకు ఆలౌట్ చేశారు. మహమ్మద్ షమీ నాలుగు వికెట్లు పడగొట్టాడు. అశ్విన్ రెండు, భువనేశ్వర్, ఓజా, సచిన్ తలా వికెట్ తీశారు.
విండీస్ జట్టులో శామ్యూల్స్ (65) టాప్స్కోరర్. ఓపెనర్లు క్రిస్గేల్ (18), పావెల్ (28) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో డారెన్ బ్రావో (23)తో కలసి శామ్యూల్స్ కాసేపు వికెట్లపతనానికి అడ్డుకట్ట వేశాడు. కాగా శామ్యూల్స్ను షమీ అవుట్ చేయడంతో విండీస్ పతనం వేగంగా సాగింది. చందర్పాల్ (36) కాసేపు పోరాడిన ఇతర బ్యాట్స్మెన్ పెవిలియన్కు వరుస కట్టారు. దీంతో విండీస్ తొలి ఇన్నింగ్స్ మొదటి రోజే ముగిసింది. కాగా భారత్ తొలిరోజు పది ఓవర్లు పాటు బ్యాటింగ్ చేయనుంది. బ్యాటింగ్ దిగ్గజం సచిన్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.