వైఎస్ పద్మమ్మకు కన్నీటి వీడ్కోలు
నంద్యాల: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పెదనాన్న వైఎస్ ప్రభుదాస్‌రెడ్డి సతీమణి పద్మమ్మకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, క్రైస్తవ సోదరులు శుక్రవారం కన్నీటి వీడ్కోలు పలికారు. వైఎస్సార్ కడప జిల్లాలోని పులివెందులలో అనారోగ్యంతో కన్నుమూసిన ఆమె భౌతికకాయాన్ని గురువారం రాత్రి జ్ఞానాపురంలోని ఆమె ఇంటికి తీసుకొచ్చారు. కుటుంబసభ్యులు, వైఎస్‌ఆర్‌సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, మనోహర్‌రెడ్డి, రిటైర్డు ఐఏఎస్ అధికారి భగవాన్‌దాస్, సునీల్‌రెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ నంద్యాల ఇన్‌చార్జి రాజగోపాల్‌రెడ్డి ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. సాయంత్రం 5గంటలకు జ్ఞానాపురంలోని క్రైస్తవ శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలునిర్వహించారు.