సచిన్ వీడ్కోలు టెస్టూ రికార్డే | Sachin Tendulkar's farewell Test gets highest TV ratings in 8 years | Sakshi
Sakshi News home page

సచిన్ వీడ్కోలు టెస్టూ రికార్డే

Published Thu, Nov 21 2013 5:48 PM | Last Updated on Mon, Oct 1 2018 5:14 PM

సచిన్ వీడ్కోలు టెస్టూ రికార్డే - Sakshi

సచిన్ వీడ్కోలు టెస్టూ రికార్డే

భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చరిత్రాత్మక 200వ టెస్టుకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారత్లో గత ఎనిమిదేళ్లుగా టీవీల ద్వారా అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్గా రికార్డులకెక్కింది. ముంబైలో ఇటీవల వెస్టిండీస్తో జరిగిన రెండో టెస్టు అనంతరం సచిన్ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. మాస్టర్ ముందే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మ్యాచ్పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది.

ముంబై టెస్టును స్టార్ స్పోర్ట్స్ చానెల్ ప్రసారం చేసింది. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్లో భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ జరిగిన మూడు రోజులు క్రికెట్ అభిమానులు ఆద్యంతం వీక్షించారు. టీవీటీల సగటు 1739గా నమోదైంది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికమని చానెల్ నిర్వాహకులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement