TV ratings
-
ఐపీఎల్ రేటింగ్స్ ఎందుకు తగ్గాయ్! విశ్లేషించిన బిజినెస్ మ్యాగ్నెట్
క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించే కార్పోరేట్ కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్‌కి సరైన వేదికగా భావించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రేటింగ్స ఈ సీజన్లో దారుణంగా పడిపోయాయి. గతేడాదితో పోల్చితే 15 నుంచి 40 ఏళ్ల వయసులో వివిధ కేటగిరీల్లో సగటున 30 శాతం పైగానే వీక్షకుల సంఖ్య తగ్గిపోయింది. దీనిపై సియట్ టైర్స్ చైర్మన్ ప్రముఖ బిజినెస్ మ్యాగ్నెట్ హార్స్ హార్ష్ గోయెంకా స్పందించారు. ఐపీఎల్ టీవీ రేటింగ్స్ తగ్గడానికి హర్ష్ గోయెంకా తెలిపిన కారణాలు - ఎక్కువ మంది అభిమానుల మద్దతు ఉన్న ముంబై ఇండియన్స్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు వరుసగా ఓటమి పాలవుతుండటం - విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, మహేంద్రసింగ్ ధోని వంటి దిగ్గజాలు కూడా వరుసగా ఫెయిల్ అవుతుండటం - చాలా మ్యాచ్‌లు ఉత్కంఠ లేకుండా నీరసంగా ముగుస్తుండటం - ఎక్కువ మ్యాచ్‌లు ముంబై రీజియన్‌లో జరపడం వల్ల గ్యాలరీల్లో ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోవడం - కరోనా కారణంగా రెండేళ్ల పాటు టీవీలు, కంప్యూటర్లకు అతుక్కుపోయిన జనాలు ఇప్పుడు ఎక్కువగా బయట తిరగాలి అనుకోవడం వల్ల ఈసారి ఐపీఎల్ రేటింగ్స్ తగ్గిపోయినట్టు హర్ష్ గోయెంకా వివరించారు. ఐపీఎల్ తాజా సీజన్ మొదటి వారానికి సంబంధించి బార్క్ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో గతేడాదితో పోల్చితే వివిధ వయసుల వారీగా 15-21 గ్రూప్‌లో 38 శాతం, 22-30 గ్రూపులో 33 శాతం. 31-40 గ్రూపులో 32 శాతం మేర వీక్షకుల సంఖ్య తగ్గినట్టు తెలిపింది. రెండో వారం ఫలితాల్లో ఇది 40 శాతానికి చేరవచ్చని తెలిపింది. ఐపీఎల్ ప్రసార హక్కులను స్టార్‌టీవీ రూ.3,200 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్ ద్వారా రూ.4000 కోట్ల రెవెన్యూ ఆశిస్తోంది. ఐపీఎల్లో 10 సెకన్ల యాడ్‌కి రూ.16.50 లక్షల ఫీజు వసూలు చేస్తోంది స్టార్. చదవండి: ప్రచారంలో పీక్స్.. మొబైల్ కొంటే పెట్రోల్, నిమ్మకాయలు ఉచితం -
దిగజారుతున్న మీడియా విలువలను కాపాడాలి
-
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
-
ఫేక్ టీఆర్పీ రేటింగ్ స్కాం గుట్టురట్టు
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ టీర్పీ రేటింగ్స్ పొందుతూ అక్రమాలకు పాల్పడుతున్న టీవీ రేటింగ్స్ స్కాంను ముంబై పోలీసులు బట్టబయలు చేశారు. జనాలకు డబ్బులిచ్చి, తమ ఛానల్ మాత్రమే చూడాలని మీటర్స్‌ను అమర్చి అక్రమంగా రేటింగ్స్ పెంచుకుంటున్న ఛానల్స్‌ను పోలీసులు గుర్తించారు. విధంగా అక్రమాలకు పాల్పడుతున్న ఛానల్స్‌లో ఓ ప్రముఖ జాతీయ మీడియాతో మహారాష్ట్రకు చెందిన మరో రెండు ఛానల్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఈ మేరకు గురువారం ముంబైలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ముంబై పోలీస్ కమిషనర్ పరయ్ బీర్ సింగ్.. టీవీ రేటింగ్స్ స్కాం వివరాలను గురువారం వెల్లడించారు. బార్క్ సంస్థ ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులకు ఫేక్ టీర్పీ రేటింగ్ వివరాలు తెలిశాయని తెలిపారు. దీనిలో బార్క్ మాజీ ఉద్యోగులతో పాటు మరికొంత మంది ప్రముఖులు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఛానల్ మాత్రమే చూస్తామన్నవారికి ఉచిత టీవీతో పాటు కొంత నగదును సైతం అందిస్తారని పేర్కొన్నారు. తాజా స్కాంతో సంబంధముందని అనుమానిస్తున్న ఇద్దరు మరాఠీ టీవీ యజమానులను పోలీసులు అరెస్ట్ చేయగా.. మరికొంతమందికి నోటీసులు ఇచ్చారు. ఈ వ్యవహారం టెలివిజన్‌తో పాటు, రాజకీయంగాను చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ స్కాంలో జాతీయ మీడియాకు చెందిన ఓ ప్రముఖ ఛానల్ యజమాని కూడా ఉన్నాడని సమాచారం. -
ఐపీఎల్-2020: అత్యధిక టీవీ రేటింగ్స్
అబుదాబి : యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్-2020 సీజన్‌కు అత్యధిక టీవీ రేటింగ్ వచ్చే అవకాశం ఉందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అంచనా వేశారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారత్‌లో టోర్నీని నిర్వహించలేకపోతున్నామని, గతంలో కంటే ఈసారి అత్యధిక వీక్షకులు లీగ్‌ను చూస్తారని తెలిపారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా స్టేడియంలోకి ప్రేక్షకులను అనుమతించకపోవడం కారణంగా.. టీవీల ద్వారానే ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్‌ను వీక్షిస్తారని గంగూలీ అభిప్రాయపడ్డారు. దీని ద్వారా టీవీలకు అత్యధిక రేటింగ్ రానుందని సోమవారం నిర్వహించిన ఓ సమావేశంలో అన్నారు. సెప్టెంబర్ 19న ఐపీఎల్ 2020 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మొత్తం మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దుబాయ్, అబుదాబి, షార్జా వేదికలుగా ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహించనున్నారు. (సీఎస్కేలో ఖేదం.. ఆర్సీబీలో మోదం) షెడ్యూల్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే గత రన్నరఫ్ జట్టు సీఎస్కేను కరోనా వైరస్ వెంటాడుతోంది. జట్టులోని ఇద్దరు కీలక ఆటగాళ్లతో పాటు పదిమంది సిబ్బంది వైరస్ బారినపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామం లీగ్ షెడ్యూల్‌పై పడే అవకాశం ఉందని వార్తలూ వినిపించాయి. అయితే అనుకున్న షెడ్యూల్ ప్రకారమే లీగ్‌ను ప్రారంభిస్తామని ఇటీవల లీగ్ నిర్వహకులు ప్రకటించారు. మరోవైపు బిగ్ టోర్నీ కోసం భారత్‌తో పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులు ఐపీఎల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. (రైనాకు సీఎస్కే దారులు మూసుకుపోయినట్లేనా..!) -
మోదీ ‘లాక్డౌన్’ ప్రసంగానికి భారీ రేటింగ్‌లు
న్యూఢిల్లీ: దేశమంతటా 21 రోజుల పాటు లాక్డౌన్ ప్రకటిస్తూ ఈ నెల 24న ప్రధాని మోదీ చేసిన ప్రసంగం టీవీ వీక్షణల పరంగా అత్యధిక రేటింగ్‌ను సాధించిందని ప్రసార వీక్షకుల పరిశోధనా మండలి (బార్క్) తెలిపింది. ఇది 2016లో మోదీ ప్రసంగించిన పెద్ద నోట్ల రద్దు కంటే అత్యధికమని తెలిపింది. 19.7 కోట్ల మంది ప్రజలు ఆ ప్రసంగాన్ని వీక్షించినట్లు తెలిపింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 13.3 కోట్ల మంది వీక్షించగా, అంతకంటే ఎక్కువ మంది మోదీ ప్రసంగాన్ని వీక్షించారు. -
4 గంటల మ్యాచ్‌లు రద్దు!
ఐపీఎల్-8 అన్ని రకాలుగా విజయవంతం అయిందని ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు. టోర్నీకి సంబంధించి కొన్ని గణాంకాలు ఆయన వెల్లడించారు. 20 శాతం టీవీ రేటింగ్‌లు, స్టేడియంలో ప్రేక్షకుల సంఖ్య 15 శాతం పెరిగాయని... తొలి ఐపీఎల్‌తో పోలిస్తే ఆదాయం 120 శాతం పెరిగిందన్న ఠాకూర్, ఓవరాల్‌గా 200 కోట్ల మంది ఐపీఎల్ చూశారని వివరించారు. కొత్తగా 16 నగరాల్లో ఈసారి ఏర్పాటు చేసిన ‘ఫ్యాన్ పార్క్’ సిస్టం కూడా విజయవంతమైందని, గుంటూరులో 20 వేల మంది చూశారని ఠాకూర్ చెప్పారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఐపీఎల్లో దాదాపు ప్రతీ చోటా మ్యాచ్‌లు చూశారని, భవిష్యత్తు కోసం యువ ఆటగాళ్ల లీగ్ ప్రదర్శనపై కూడా వారు ఓ కన్నేసి ఉంచారని గుర్తు చేశారు. కొన్ని మ్యాచ్ ఫలితాలపై ఈడీ దృష్టి పెట్టిందనడంలో వాస్తవం లేదని, ఒకే ఒక ఆటగాడిని బుకీలు సంప్రదిస్తే అతను వెంటనే ఏసీయూకు సమాచారం అందించాడని ఆయన చెప్పారు. ఐపీఎల్లో 4 గంటల నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్‌ల రద్దు, అన్క్యాప్డ్ ప్లేయర్ల గురించి చర్చ జరిగిందని, వీటిపై తుది నిర్ణయం తర్వాత తీసుకుంటామని ఆయన చెప్పారు. -
సచిన్ వీడ్కోలు టెస్టూ రికార్డే
భారత బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చరిత్రాత్మక 200వ టెస్టుకు అద్భుతమైన స్పందన వచ్చింది. భారత్‌లో గత ఎనిమిదేళ్లుగా టీవీల ద్వారా అత్యధిక మంది వీక్షించిన మ్యాచ్‌గా రికార్డులకెక్కింది. ముంబైలో ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టు అనంతరం సచిన్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన సంగతి తెలిసిందే. మాస్టర్ ముందే రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ మ్యాచ్‌పై విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. ముంబై టెస్టును స్టార్ స్పోర్ట్స్ చానెల్ ప్రసారం చేసింది. మూడు రోజుల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. మ్యాచ్ జరిగిన మూడు రోజులు క్రికెట్ అభిమానులు ఆద్యంతం వీక్షించారు. టీవీటీల సగటు 1739గా నమోదైంది. గత ఎనిమిదేళ్లలో ఇదే అత్యధికమని చానెల్ నిర్వాహకులు తెలిపారు.