
న్యూఢిల్లీ: దేశమంతటా 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటిస్తూ ఈ నెల 24న ప్రధాని మోదీ చేసిన ప్రసంగం టీవీ వీక్షణల పరంగా అత్యధిక రేటింగ్‌ను సాధించిందని ప్రసార వీక్షకుల పరిశోధనా మండలి (బార్క్) తెలిపింది. ఇది 2016లో మోదీ ప్రసంగించిన పెద్ద నోట్ల రద్దు కంటే అత్యధికమని తెలిపింది. 19.7 కోట్ల మంది ప్రజలు ఆ ప్రసంగాన్ని వీక్షించినట్లు తెలిపింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ను 13.3 కోట్ల మంది వీక్షించగా, అంతకంటే ఎక్కువ మంది మోదీ ప్రసంగాన్ని వీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment