న్యూఢిల్లీ: కేంద్రమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నిర్వహిస్తున్న భేటీ ఇంకా కొనసాగుతోంది. వర్చువల్ విధానం ద్వారా ప్రధాని ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, కోవిడ్ కట్టడికి చర్యలు, వ్యాక్సినేషన్ వంటి అంశాలపై చర్చిస్తున్నారు. దీంతోపాటు ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్, కరోనా వ్యాక్సిన్, అత్యవసరమైన ఔషధాలు తదితర ముఖ్యమైన విషయాలపై మంత్రులతో, అధికారులతో చర్చిస్తున్నారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో లాక్‌డౌన్ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేశారు. స్థానిక అవసరాలకు అనుగుణంగా నియంత్రణ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు సూచించారు. కంటైన్‌మెంట్ జోన్లను కొనసాగించాలని, దేశవ్యాప్తంగా కరోనా టెస్టులు పెంచాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొన్నారు.
చదవండి: దడ పుట్టిస్తున్న సెకండ్ వేవ్ .. ఒక్కరోజే 3,498 మరణాలు
Comments
Please login to add a commentAdd a comment