
న్యూఢిల్లీ: గాయం కారణంగానే ఆంధ్రప్రదేశ్ వెయిట్‌లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ (85 కేజీలు) పేరును టార్గెట్ ఒలింపిక్ పోడియం (టాప్) పథకం నుంచి తొలగించినట్లు భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) తెలిపింది. అతనితో పాటు సతీశ్ శివలింగం (77 కేజీలు) గాయాలతో బాధపడుతుండటంతో వారి పేర్లను ఈ జాబితా నుంచి తప్పించినట్లు పేర్కొంది. ‘కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణాలు నెగ్గిన వారిద్దరు గాయాల నుంచి కోలుకొని తిరిగి ‘టాప్’లో చోటు దక్కించుకుంటారని భావిస్తున్నా’ అని ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ కార్యదర్శి సహదేవ్ తెలిపారు.
ఈ ఇద్దరితో పాటు పూనమ్ యాదవ్‌ను కూడా ఈ జాబితా నుంచి తొలిగించారు. ఆమె చెప్పాపెట్టకుండా జాతీయ శిబిరం నుంచి గైర్హాజరు అయిన నేపథ్యంలో ఆమె పేరు తొలగించారు. ఈ ముగ్గురి స్థానంలో కొత్తగా మరో ముగ్గురికి చోటు కల్పించారు. సంజిత చాను (53 కేజీలు), పర్‌దీప్ సింగ్ (105 కేజీలు), రాఖీ (63 కేజీలు)లను ఈ జాబితాలో చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment