
కొలంబో: శ్రీలంక జట్టు నుంచి బ్యాట్స్‌మెన్ కుశాల్ మెండీస్, ఓపెనర్ కౌషల్ సిల్వాలకు సెలక్టర్లు ఉద్వాసన పలికారు. కాలి కండరాల గాయం నుంచి కోలుకున్న ఏంజెలో మాథ్యూస్ తిరిగి జట్టులోకి వచ్చాడు. భారత పర్యటన కోసం 15 మంది సభ్యులు గల శ్రీలంక జట్టును ఆదివారం ప్రకటించారు. ఈ జట్టులో కొత్త ముఖం రోషెన్ సిల్వాకు అవకాశం కల్పించారు. టీమిండియాతో లంక మూడు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20ల సిరీస్‌లో పాల్గొంటుంది.
జట్టు: చండిమల్ (కెప్టెన్), కరుణరత్నే, ధనంజయ డిసిల్వా, సదీర సమరవిక్రమ, మాథ్యూస్, లహిరు తిరిమన్నే, హెరాత్, సురంగ లక్మల్, దిల్‌రువాన్ పెరీరా, లహిరు గమగే, లక్షన్ సందకన్, విశ్వ ఫెర్నాండో, దసున్ షణక, డిక్‌వెలా, రోషెన్ సిల్వా.
Comments
Please login to add a commentAdd a comment