బ్యాడ్మింటన్‌కు అరవింద్ భట్ వీడ్కోలు
జాతీయ మాజీ చాంపియన్, 2014 జర్మన్ ఓపెన్ విజేత అరవింద్ భట్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
న్యూఢిల్లీ: జాతీయ మాజీ చాంపియన్, 2014 జర్మన్ ఓపెన్ విజేత అరవింద్ భట్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. త్వరలో కోచ్‌గా మారేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు 36 ఏళ్ల అరవింద్ తెలిపాడు. ‘ఇక బ్యాడ్మింటన్ టోర్నీలు ఆడను. గత ఆరు నెలలపాటు ఆలోచించి తీసుకున్న నిర్ణయమిది. హైదరాబాద్‌లోని అకాడమీలో కోచ్‌గా బాధ్యతలు తీసుకునే ఆలోచన ఉంది’ అని 2008, 2011లో జాతీయ చాంపియన్‌గా నిలిచిన అరవింద్ పేర్కొన్నాడు. 2002లో తొలిసారి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అరవింద్ థామస్ కప్‌లో ఏడుసార్లు, 2010 ఆసియా క్రీడల్లో ఒకసారి, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగుసార్లు బరిలోకి దిగాడు. కోచ్‌గా మారాలని అనుకుంటున్న అరవింద్ ఇటీవల డచ్ ఓపెన్, డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్‌లలో చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి భారత జట్టుతో ఉన్నాడు.