ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని మామిడికుదురు మండలానికి చెందిన వాసం శెట్టి రవితేజ పోలీసు విభాగంలో ఉన్నతాధికారిగా పనిచేస్తూ, అందరి మన్ననలు అందుకుంటున్నారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఎస్పీగా పనిచేసిన రవితేజ ఇటీవలే గాంధీనగర్‌కు బదిలీ అయ్యారు.
పోలీసు అధికారి రవితేజకు జునాగఢ్ వాసులు ఎంతో భిన్నంగా వీడ్కోలు పలికారు. ఈ వీడ్కోలు కార్యక్రమం పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి ప్రారంభమైంది. ముందుగా పూలతో అలంకరించిన కారులో అధికారి రవితేజను కూర్చోబెట్టారు. పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం నుండి పోలీసు కాన్వాయ్ జునాగఢ్ వీధుల గుండా ముందుకు సాగింది. ఈ సమయంలో జునాగఢ్ ప్రజలు పోలీసు సూపరింటెండెంట్‌కు రహదారి మార్గంలో అపూర్వరీతిలో వీడ్కోలు పలికారు.
2015 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రవితేజ జునాగఢ్ ఎస్పీగా మూడేళ్లు సేవలు అందించారు. 2019లో జునాగఢ్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌గా నియమితులయ్యారు. తాజాగా జునాగఢ్ నుంచి గుజరాత్‌లోని గాంధీనగర్ ఎస్పీగా బదిలీ అయ్యారు. గాంధీనగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించేందుకు వచ్చిన ఆయనపై స్థానికులు పూలవర్షం కురిపిస్తూ, అపూర్వ స్వాగతం పలికారు. రవితేజ పోలీసు విభాగంలో అందించిన సేవలకు గుర్తుగా అప్పటి డిప్యూటీ సీఎం నవీన్ పటేల్ చేతులమీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి గుజరాత్‌లో ఇంతటి పేరుప్రఖ్యాతులు సంపాదించడంపై కోనసీమ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: ‘ఆరోపణలతో పెరుగుతున్న ఆదరణ’.. ట్రంప్ మరో వింత వ్యాఖ్యానం!
Comments
Please login to add a commentAdd a comment