
వీడలేక ... వీడ్కోలంటూ
చదువులమ్మ ఒడిలో ఒక్కటిగా చేరిన నేస్తాలు వీడలేక వీడ్కోలు చెప్పుకున్నారు. మరిన్ని పెద్ద చదువులు చదివి మెరుగైన భవిష్యత్‌ను సాధించుకునే దిశగా కష్టమైనా సరే ఇష్టంగానే టాటా చెప్పుకున్నారు. ఇందుకు బెంగళూరులోని ఆర్.టి.నగర్‌లో ఉన్న నారాయణ పీయూ కళాశాల వేదికైంది.
కళాశాల ఆధ్వర్యంలో ఫేర్‌వెల్ డే సంబరాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కళాశాల డీన్ నాగరాజు, ప్రిన్సిపాల్ రమణకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- బెంగళూరు