BCCI Fare Well Test Offer To Kohli: అనూహ్య పరిణామాల మధ్య టీమిండియా టెస్ట్ సారధ్య బాధ్యతల నుంచి విరాట్ కోహ్లి వైదొలిగిన విషయం తెలిసిందే. అయితే, కోహ్లి.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ముందు జరిగిన ఓ పరిణామం ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. కోహ్లి సంచలన ప్రకటనకు కొద్ది గంటల ముందు బీసీసీఐ నుంచి కోహ్లికి ఓ ఆఫర్ వచ్చిందట. తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే 100వ టెస్ట్ మ్యాచ్‌కు సారధిగా వ్యవహరించిన తర్వాత కెప్టెన్సీ నుంచి వైదొలిగే అంశాన్ని పరిశీలించాల్సిందిగా బీసీసీఐ ప్రతినిధి కోహ్లిని కోరాడట.
అయితే ఈ ఆఫర్‌ను కోహ్లి సున్నితంగా తిరస్కరిస్తూ.. తనకెటువంటి ఫేర్‌వెల్ టెస్ట్ అవసరం లేదని, నేను ఇలాంటి విషయాలను పెద్దగా పట్టించుకోనని, తనకు మొదటి మ్యాచైనా, వందో మ్యాచైనా ఒకటేనని సదరు అధికారికి బదులిచ్చాడట. కాగా, కోహ్లి వచ్చే నెలలో(ఫిబ్రవరి 25-30) శ్రీలంకతో తలపడబోయే తొలి టెస్ట్ ద్వారా వంద టెస్ట్‌ల మైలురాయిని చేరుకోనున్నాడు. ఈ టెస్ట్‌కు బెంగళూరు వేదిక కానుంది. కోహ్లికి ఐపీఎల్ వల్ల ఈ నగరంతో ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది.
దీంతో అతని గౌరవార్ధం ఈ నగరంలో ఫేర్‌వెల్ టెస్ట్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ యోచించినట్లు తెలుస్తోంది. అయితే, ఇదివరకు జరిగిన పరిణామాల దృష్ట్యా బీసీసీఐ ఇచ్చిన అఫర్‌ను కోహ్లి తిరస్కరించాడని సమాచారం. కాగా, 68 టెస్ట్‌ల్లో టీమిండియాకు సారధిగా వ్యవహరించిన కోహ్లి.. ఏకంగా 40 మ్యాచ్‌ల్లో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ క్రమంలో అతను భారత్ తరఫున అత్యధిక విజయాలు అందుకున్న సారథిగా రికార్డుల్లోకెక్కాడు.
చదవండి: Test Captain: భారత టెస్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అతడే!
Comments
Please login to add a commentAdd a comment