షర్మిలమ్మకు ఆత్మీయ వీడ్కోలు | ys sharmila election campaign in Guntur | Sakshi
Sakshi News home page

షర్మిలమ్మకు ఆత్మీయ వీడ్కోలు

Published Sat, May 3 2014 12:49 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

షర్మిలమ్మకు ఆత్మీయ వీడ్కోలు - Sakshi

షర్మిలమ్మకు ఆత్మీయ వీడ్కోలు

 - కుంచనపల్లిలో రాత్రి బస
 - ఉదయం కృష్ణాజిల్లాకు పయనం

 
 తాడేపల్లి రూరల్, న్యూస్‌లైన్, సార్వత్రిక ఎన్నికల ప్రచారం కోసం జిల్లాకు వచ్చిన వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి సోదరి షర్మిలకు శుక్రవారం అభిమానులు, పార్టీ కార్యకర్తలు వీడ్కోలు పలికారు. గురువారం రాత్రి పది గంటలకు వైఎస్సార్ జనభేరి ప్రచారం ముగించిన ఆమె వెనిగండ్ల నుంచి తాడేపల్లి మండలం కుంచనపల్లి చేరుకున్నారు. అరవింద హైస్కూల్‌లో రాత్రి బస చేశారు. శుక్రవారం ఉదయం కృష్ణా జిల్లా పర్యటనకు బయలుదేరి వెళ్లారు. అంతకు ముందు పార్టీ మంగళగిరి అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)తో కొద్దిసేపు మాట్లాడారు. నియోజకవర్గ పరిస్థితిపై ఆరా తీశారు. షర్మిల బస చేసిన ప్రాంతానికి భారీ సంఖ్యలో మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.

కృష్ణాజిల్లాకు బయలుదేరుతూ రాజన్న తనయ తన కోసం నిరీక్షిస్తున్న వారిని ఆప్యాయంగా పలుకరిస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ పాటిబండ్ల కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ పాతూరి లలితకుమారి, ఎంపీటీసీ మాజీ సభ్యురాలు బొమ్మారెడ్డి సునీత, సర్పంచులు పాతూరి మేరిరాణి, పంది ఏసుబాబు, బడుగు శ్రీనివాసరావు, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ కమిటీ సభ్యులు జెక్కిరెడ్డి ప్రభాకరరెడ్డి(జేపీ), రాష్ట్ర మహిళా కమిటీ సభ్యురాలు చీడిపూడి జయలక్ష్మి, ఎస్సీసెల్ కన్వీనర్ సంకూరి మరియబాబు, మాజీ సర్పంచ్ విజయేంద్రవర్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement