హైదరాబాద్: ఇవాళ ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు హైదరాబాద్‌లో చివరిరోజు. దీంతో ఏపీ సచివాలయంలో శనివారం సందడి వాతావరణం నెలకొంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సచివాలయ ఉద్యోగులు ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకుంటున్నారు. అయితే.. ఏపీ ప్రభుత్వం డెడ్‌లైన్ పెట్టడంతో కొందరు ఉద్యోగులకు సమస్యలు ఉన్నా వెలగపూడికి వెళ్లక తప్పని పరిస్థితిలో ఉన్నారని ఏపీ సచివాలయ సంఘం నేత మురళీకృష్ణ వాపోయారు. ఉద్యోగులుగా ఉన్న దంపతులకు ప్రభుత్వం మరికొంత వెసులుబాటు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ సచివాలయాన్ని పూర్తిస్థాయిలో ఖాళీ చేయడం లేదని, తెలంగాణకు అప్పగించేందుకు మరికొంత సమయం పడుతుండొచ్చని మురళీకృష్ణ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన తెలంగాణ ఉద్యోగులను వెనక్కి తీసుకోవడంపై తెలంగాణ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలన్నారు.
సచివాలయంలో వీడ్కోలు సందడి
Published Sat, Oct 1 2016 1:44 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
Advertisement
Advertisement