
సూర్యాపేట్ : జిల్లా పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి క్వానాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. అదుపు తప్పి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కాన్వాయ్‌లో ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
శుక్రవారం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి జాన్ పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తున్నారు. ఆ సమయంలో మండల కేంద్రమైన గరిడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో కాంగ్రెస్ కార్యకర్తలకు అభివాదం చేసేందుకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారును డ్రైవర్ ఆపారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న క్వాన్వాయ్ వెనుక ఉన్న ఆరు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదు. కార్యకర్తలకు అభివాదం చేసిన అనంతరం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉరుసు ఉత్సవాలకు బయల్దేరి వెళ్లారు. అనంతరం పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
