వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్లో సోమవారం ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి.
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్లో సోమవారం ప్రమాదవశాత్తు రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఏఆర్ కానిస్టేబుల్ గాయపడగా, అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన కుంచనపల్లి వద్ద చోటుచేసుకుంది. కాగా ప్రకాశం జిల్లా పర్యటన నిమిత్తం వైఎస్ జగన్ ఈరోజు ఉదయం హైదరాబాద్ నుంచి బయల్దేరిన విషయం తెలిసిందే. ఆయన విమానంలో గన్నవరం చేరుకుని ...అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా గుంటూరు, అనంతరం ప్రకాశం జిల్లా చేరుకోనున్నారు.