
హుజూరాబాద్(కరీంగనగర్ జిల్లా): టీఆర్‌ఎస్-బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. హుజురాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఫ్లెక్సీల అంశానికి సంబంధించి గురువారం సాయంత్రం ప్రాంతంలో టీఆర్‌ఎస్-బీజేపీ కార్యకర్తలు బహిరంగ చర్చ సవాళ్లతో హంగామా సృష్టించారు. ఈ క్రమంలోనే ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తతలకు దారి తీసింది.
Comments
Please login to add a commentAdd a comment