హుజూరాబాద్: ‘పేదవారికి నష్టం జరిగితే ఊరుకునేది లేదు. ఈటల అమాయకుడే కావొచ్చు. కానీ, ఉద్యమ బిడ్డ అని మర్చిపోవద్దు. భూమి ఆకాశం ఒకటి చేస్తా’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతి భవన్ నుంచి కేసీఆర్, సింగాపూర్‌లో కూర్చొని హరీశ్ రావు ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చారని గుర్తు చేశారు.
‘ఒడ్డు ఎక్కేదాక ఓడ మల్లన్న, ఒడ్డు ఎక్కిన తరువాత బోడ మల్లన్న’ అన్నట్లు కేసీఆర్ పనితీరు ఉందన్నారు. హుజూరాబాద్ ఎన్నికలు అనగానే సీఎంకు దళితులు గుర్తుకొచ్చారని, హుజూరాబాద్‌లో 21 వేల దళిత కుటుంబాలకు, రూ.21 వేల కోట్లు కలెక్టర్ దగ్గర డిపాజిట్ చేసి, రాత్రికి రాత్రి పాస్‌బుక్‌లు ఇచ్చి దళితుల ఓట్లు కొల్లగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు. దళితబంధు రూ.10 లక్షల మీద కలెక్టర్, బ్యాంక్‌ల పెత్తనం వద్దని, అన్ని కుటుంబాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌పై ప్రజలకు విము ఖత ఉందని తెలిపారు. ‘ఇకనైనా దిగిరా.. ప్రజలకు విశ్వా సం కల్పించు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడి ఇదే మా భాష అని తెలంగాణను కించపరచకు’ అని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment