హజురాబాద్: సింగాపూర్‌లో కార్యకర్తలను ఆహ్వానిస్తున్న మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్: ఎమ్మెల్యేగా 18 ఏళ్లకు పైగా హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పదవిని అనుభవించిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఒక్క ఇల్లయినా కట్టించిండా అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ గెలుపుతోనే హుజూరాబాద్ అభివృద్ధి ముడిపడి ఉందని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలంలోని సింగాపూర్‌లో గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు మండలాలకు చెందినవారు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
చదవండి: టీఆర్‌ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం
అనంతరం మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. 18 ఏళ్ల పాటు ఈటల రాజేందర్‌ను గెలిపించిన ప్రజలు, ఎంత మేరకు అభివృద్ధి చేశాడో ఆలోచన చేయాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ మంత్రికి నాలుగు వేల ఇళ్లు ప్రజలకు నిర్మించి ఇవ్వాలని ఆదేశిస్తే.. అందరూ వారివారి నియోజకవర్గాల్లో పూర్తిచేశారని తెలిపారు. అయితే ఒక్క ఇల్లు కూడా నిర్మించని మంత్రిగా ఈటల రాజేందర్ మిగిలిపోయారని చెప్పారు. తన సమస్యలను ప్రజలపై రుద్దుతున్నారని ఆరోపించారు. ఈటల రాజేందర్ ప్రజల సమస్యలను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలకు సొంతంగా స్థలం ఉంటే.. ఇల్లు కట్టించే బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. రెండున్నరేళ్ల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు సంపత్‌రావు, శ్రీనివాస్, శంకర్‌రావు, దుర్గారెడ్డి, సాయికుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment