సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో సెప్టెంబరు 1 నుంచి ప్రత్యక్ష బోధన ప్రారంభించాలంటూ రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రజాహితవ్యాజ్యం (పిల్) దాఖలైంది. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన అధ్యాపకుడు ఎం.బాలకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ‘‘జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఇటీవల కేంద్రానికి ఇచ్చిన నివేదిక ప్రకారం కరోనా మూడో దశలో చిన్నారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. విద్యార్థులకు టీకాలు ఇవ్వలేదు. కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టకముందే పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభిస్తుండటం విద్యార్థుల జీవితాలను ప్రమాదంలోకి నెట్టడమే.ప్రత్యక్షబోధనను నిలిపివేసేలా ఆదేశాలు జారీచేయం డి. రాష్ట్రప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సస్పెండ్ చేయండి’’అని పిటిషన్‌లో కోరారు. చదవండి: ‘డబుల్’ ఇళ్ల పంపిణీ: సీఎం ఇంట్లో లిఫ్ట్ మాదిరే ఇక్కడ కూడా
ఈ పిల్‌లో విద్యాశాఖ కార్యదర్శి, పాఠశాలవిద్య, ప్రజారోగ్యవిభాగం డైరెక్టర్లతోపాటు కరోనా అంశాలకు సంబం«ధించి సలహాలిచ్చిన నీలోఫర్ చిన్నపిల్లల ఆస్పత్రి వైద్యు లతో కూడిన నిపుణుల కమిటీ ప్రతినిధి బృందాన్ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విచారణకు రానుంది. చదవండి: ‘దళితబంధు’ సర్వే చకచకా..
ప్రత్యక్ష బోధన ఆపండి.. హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలు
Published Sun, Aug 29 2021 3:18 AM | Last Updated on Sun, Aug 29 2021 7:31 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment