తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి చంద్రబాబు నాయుడే పరోక్ష కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పదిరోజుల పాటు చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. నిన్న ఉదయం 9 గంటల వరకు కూడా చంద్రబాబతో భేటీకి కోడెల ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి పేర్కొన్నారు.