Kodela Siva Prasada Rao: ‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు..’ | Ambati Rambau Fires on Chandrababu - Sakshi Telugu
Sakshi News home page

బాబు దుర్మార్గ వైఖరే కోడెల ఆత్మహత్యకు కారణం

Published Sat, May 2 2020 6:25 PM | Last Updated on Sat, May 2 2020 7:16 PM

YSRCP MLA Ambati Rambabu Comments On Chandrababu - Sakshi

సాక్షి, గుంటూరు: కోడెల జయంతిని పురస్కరించుకుని అతని ఆత్మహత్యను వైఎస్సార్‌సీపీ మీదకు నెట్టాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు చూస్తున్నారని ట్విట్టర్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మండిపడ్డారు. ఆరుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించి.. అనేక పదవులు నిర్వహించిన అరుదైన నాయకుడు కోడెల శివప్రసాద్‌రావు అని అన్నారు. ఓటమి చెందిన తర్వాత కోడెల పట్ల బాబు దుర్మార్గ వైఖరే ఆత్మహత్యకు కారణమన్నారు. వెన్నుపోటు పొడవడం, దండేసి పొగడటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. ‘ఇంతకీ కోడెల శివప్రసాద్ సెల్‌ఫోన్ ఏమైనట్టు! ఫార్మాట్ చేయకుండా బయటపెట్టగలరా’ అని ప్రశ్నిస్తూ అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు.
(‘నాకు రిప్లై ఇచ్చారహో..’)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement