టీడీపీ సీనియర్ నాయకుడు, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆకస్మిక మృతిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు స్పందించారు. కోడెల మృతిపై అనేక సందేహాలు కలుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోడెల మృతిపై పోలీసులు పూర్తిస్థాయి విచారణ జరపాలని ఆయన కోరారు. పోలీసుల విచారణలో వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.