సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని
సాక్షి, అమరావతి: తమ ప్రభుత్వం ఎవరిపైనా కక్షసారింపు చర్యలకు పాల్పడట్లేదని ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖమంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మరణానికి చంద్రబాబు నాయుడే పరోక్ష కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. పదిరోజుల పాటు చంద్రబాబు కనీసం ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదని, నమ్మిన నాయకుడు, పార్టీ చేసిన అవమానంతోనే ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నామన్నారు. నిన్న ఉదయం 9 గంటల వరకు కూడా చంద్రబాబతో భేటీకి కోడెల ప్రయత్నించారని, దానికి నిరాకరించడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారని మంత్రి పేర్కొన్నారు. కోడెల ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ప్రభుత్వం కేసులు పెడితే పోరాడే తత్వం కలిగిన వ్యక్తిఅని వ్యాఖ్యానించారు. కోడెలను ప్రభుత్వం వేధించిందంటూ చంద్రబాబు ఇష్టానుసారంగా విమర్శలు చేయడం సరికాదన్నారు. ఫర్నిచర్, బిల్డర్లు కేసు కానీ ప్రభుత్వం పెట్టింది కాదని.. అసెంబ్లీ ఫర్నిచర్ తన ఇంట్లో ఉందని శివప్రసాద్ అంగీకరించినట్లు మంత్రి గుర్తుచేశారు.
పల్నాడు పులి.. మరి ఎందుకు అడ్డుకున్నారు?
మంగళవారం ఆయన సచివాలయంలో మీడియా సమావేశంలో మట్లాడారు. ‘ఏ కేసులోను ప్రభుత్వం కోడెలకు, ఆయన కొడుకు, కుతుర్లకు ఎలాంటి నోటీస్‌లు ఇవ్వలేదు. ఆయన్ని చంద్రబాబే వదిలించుకునేలా వ్యవహరించారు. కోడెలను పార్టీలో దూరం పెట్టి అవమానించారు. అసెంబ్లీ ఫర్నిచర్ కేసులో వర్ల రామయ్యతో విమర్శలు చేయించారు. అందుకే కోడెల లాంటి వ్యక్తి అలాంటి చర్యకు పాల్పడ్డారు. 1999 లో బాంబుల కేసు విచారణ చేసి అవమానించింది చంద్రబాబు కాదా..? 2014 లో కోడెల పుట్టిన నరసరవు పేట సీటు కాదని సత్తెనపల్లి పంపి అవమానించింది చంద్రబాబు కాదా..? తరువాత మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించలేదా.? పల్నాడు పులి అని ఈరోజు చెప్తున్న చంద్రబాబు. మరి కోడెలను పల్నాడు రాకుండా ఎందుకు అడ్డకున్నారు.
కోడెల కాల్డేటాను విచారించాలి
కోడెలకు వ్యతిరేకంగా సత్తెనపల్లి లో వర్గాన్ని తయారు చేసింది ఎవరు..? ఇప్పుడు కోడెల మృతదేహం వద్ద కూర్చుని చంద్రబాబు మొసలి కన్నీరు కారుస్తున్నారు. ఎన్టీఆర్‌ని కూడా ఇలానే క్షోభకు గురి చేసి చంపించి తరువాత శవం వద్ద మొసలి కన్నీరు కార్చారు. కోడెలను ప్రభుత్వం వేధిస్తోందంటూ.. ఈ 3 నెలల్లో ఎప్పుడయినా చంద్రబాబు మాట్లాడారా..? ఆయనకు మద్దతుగా ఎవ్వరిని మాట్లాడనివ్వ లేదు. చంద్రబాబు కోడెలను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించి వేధించారు. తెలంగాణ ప్రభుత్వం కోడెల కాల్డేటాను విచారించాలి. ఇందులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలి’ అని అన్నారు.
చదవండి:
శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు
కోడెల మృతితో షాక్కు గురయ్యాను...
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
కోడెల మృతిపై కేసు నమోదు
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?
Comments
Please login to add a commentAdd a comment