
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ సంతాపం వ్యక్తం చేశారు. రాష్ట్రప్రజలకు, పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తి ఆకస్మిక మరణం తనను షాక్‌కు గురి చేసిందన్నారు. కోడెల మరణం పార్టీకి తీరని లోటన్న బాలకృష్ణ... కోడెలను బతికించడానికి వైద్యులు ఎంతో ప్రయత్నించారని.. కానీ ఫలితం దక్కలేదని వాపోయారు. క్యాన్సర్ చికిత్స అభివృద్ధికి కోడెల ఎంతో కృషి చేశారని బాలయ్య గుర్తు చేసుకున్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వస్తే కోడెల మరణం వెనక ఉన్న అసలు నిజాలు తెలుస్తాయన్నారు బాలకృష్ణ.
నివేదిక వస్తే నిజాలు తెలుస్తాయి: టీఎస్ రావు
సోమవారం ఉదయం 11.37గంటలకు కోడెలను ఆస్పత్రికి తీసుకువచ్చారని బసవతారకం మెడికల్ డైరెక్టర్ టీఎస్ రావు తెలిపారు. అప్పటికే ఆయన అపస్మారక స్థితిలో ఉన్నారని.. పల్స్ కూడా పడిపోయిందన్నారు. కోడెలను కాపాడేందుకు తమ వంతు ప్రయత్నం చేశామన్నారు. మధ్యాహ్నం 12.39గంటలకు కోడెల మరణించినట్లు ధృవీకరించామన్నారు. అప్పుడే ఆయన ఆత్మహత్య చేసుకున్న ఆనవాలు గుర్తించామని.. దాంతో పోస్ట్‌మార్టం నిమిత్తం కోడెల మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలిచామని టీఎస్ రావు పేర్కొన్నారు.
చదవండి:
కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు!
కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి
కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి
కోడెల మృతిపై కేసు నమోదు
కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు?
కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా?