అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు | Kodela Siva Prasada Rao Last Rites with Official Honours | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో కోడెల అంత్యక్రియలు

Published Tue, Sep 17 2019 12:52 PM | Last Updated on Tue, Sep 17 2019 5:01 PM

Kodela Siva Prasada Rao Last Rites with Official Honours - Sakshi

కోడెల శివప్రసాదరావు (ఫైల్‌ ఫొటో)

సాక్షి, అమరావతి: టీడీపీ సీనియర్‌ నేత, మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు అధికార లాంఛనాలతో నిర్వహించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు ఆదేశాలిచ్చారు. కాగా, కోడెల శివప్రసాదరావు పార్థీవ దేహాన్ని హైదరాబాద్‌ నుంచి నరసరావుపేటకు తరలిస్తున్నారు. కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని ఈ మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో ఉంచనున్నారు. రేపు (బుధవారం) నరసరావుపేటలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. సోమవారం హైదరాబాద్‌లో అనుమానాస్పదరీతిలో కోడెల శివప్రసాదరావు మృతి చెందారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు...
మాజీ స్పీకర్కోడెల ఆత్మహత్య

కొడుకే వేధించాడు: కోడెల బంధువు

కోడెల మృతిపై బాబు రాజకీయం!

ఆది నుంచి వివాదాలే!

కోడెల మృతిని రాజకీయం చేయవద్దు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement