
ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అంధకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్.ఎం.మోహాన్‌రెడ్డి అన్నారు.
- ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు
- వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి
శెట్టూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాష్ట్రం అంధకారం అవుతుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్.ఎం.మోహాన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తాలుకా కార్యదర్శి కిరణ్ చౌదరి సేవాదళ్ జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, కళ్యాణదుర్గం మండల కార్యదర్శి గుప్తా,ట్రేడ్ యూనియన్ నాయకులు టైలర్‌శీను, విద్యార్థివిభాగం జిల్లా కార్యదర్శి షేక్షావలీతో కలసి గురువారం ఆయన మండల పరిధిలోని కైరేవు, మాకొడికి, యాటకల్లు గ్రామలో ్లపర్యటించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్.జగన్‌ను టార్గెట్ చేసేందుకే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై గళం విప్పే సమయానికి మైకులు కట్ చేసే నీచ సాంస్కృతికి టీడీపీ ప్రభుత్వం దిగజారిందన్నారు. పర్యటనలో భాగంగా ఆయన మాకొడికి గ్రామంలో ఉపాధిహామీ పనికి వెళ్లి మృతి చెందిన వన్నూరుస్వామి కుటుంబాన్ని పరామర్శించారు. వెఎస్సార్‌సీపీలో చురుకైన కార్యకర్తగా వన్నూరుస్వామి పని చేశాడన్నారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటన్నారు. వన్నూరుస్వామి కుటుంబానికి అండగా ఉంటామన్నారు. ఉపాధి పనులకు వెళ్లి మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తాలుకా కార్యదర్శి కిరణ్ చౌదరి, జిల్లా సేవాదళ్ కార్యదర్శి సత్తినారాయణరెడ్డి, కళ్యాణదుర్గం సేవాదళ్ కార్యదర్శి గుప్తా, ట్రేడ్ యూనియన్ నాయకులు టైలర్ శీను, విద్యార్థివిభాగం జిల్లా కార్యదర్శి షేక్షావలీ, అన్వర్ , మల్లేష్, గరీబ్‌సాబ్, బోయ రామాంజినేయులు, నజీర్‌సాబ్ ఉన్నారు.