సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ పార్టీలు, పలు ప్రజా సంఘాలు చేస్తున్న దాడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు శాసనసభ సమావేశాలను వేదికగా మార్చుకోవాలని అధికార పక్షం భావిస్తోంది. ఈనెల 23 నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఈసారి సమావేశాలు ఆరు రోజుల పాటు జరిపే అవకాశం ఉంద ంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రాజెక్టుల రీఇంజనీరింగ్ (రీ డిజైనింగ్)కు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, కాళేశ్వరం వద్ద ఎత్తిపోతల పథకం, దేవాదుల రీడిజైనింగ్ వంటి అంశాలపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దాంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్ విడుదల చేయడం లేదని ఆరోపిస్తున్నాయి.
అందువల్ల ఈ అంశాలపై అఖిలపక్ష సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. కానీ అఖిలపక్ష సమావేశాలు ఏర్పాటు చేసి వివరించడం కంటే... అసెంబ్లీ సమావేశాలు వేదికగా ఆయా ప్రాజెక్టులు, ప్రభుత్వ కార్యక్రమాల గురించి వివరించాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. గోదావరి, కృష్ణా నదులపై జరిగిన జల దోపిడీ మొదలు ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ ఆవశ్యకత వరకు నేరుగా అసెంబ్లీలో వివరించడానికి కసరత్తు మొదలుపెట్టారు.
అసెంబ్లీయే అఖిలపక్షం!
Published Fri, Sep 4 2015 1:51 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement