అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం మరోసారి కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది.
27న యువజన సంఘాలతో సమావేశం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత నిరుద్యోగుల సమస్య పరిష్కారం కోసం మరోసారి కార్యాచరణ ప్రకటించాలని తెలంగాణ జేఏసీ నిర్ణయించింది. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం అధ్యక్షతన ముఖ్యనేతలు రాష్ట్ర కార్యాలయంలో శనివారం సమావేశమయ్యారు. నిరుద్యోగ నిరసన ర్యాలీని ప్రభుత్వం అడ్డుకున్న నేపథ్యంలో మరోసారి భారీ కార్యాచరణకు సిద్ధం కావాలని నిర్ణయించారు. దీనికోసం ఈ నెల 27న విద్యార్థి, యువజన సంఘాల నేతలతో సమావేశం కానున్నారు.
సుధీర్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లాల్లో సదస్సులను నిర్వహించనున్నారు. మార్చి 1న మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జేఏసీ సమావేశం కానుంది. 4న నిర్మల్ జిల్లా కేంద్రంలో, 5న కరీంనగర్‌లో, 11న హన్మకొండలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ కె.రఘు, నేతలు ఎన్.ప్రహ్లాద్, ఇటిక్యాల పురుషోత్తం, వెంకటరెడ్డి, భైరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.