టీడీపీకి మాట్లాడే హక్కు లేదు | TDP does not have the right to speak | Sakshi
Sakshi News home page

టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

Published Thu, Dec 22 2016 1:28 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

టీడీపీకి మాట్లాడే హక్కు లేదు - Sakshi

టీడీపీకి మాట్లాడే హక్కు లేదు

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు  

సాక్షి, హైదరాబాద్‌: బషీర్‌బాగ్‌ లో రైతులను పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపిన టీడీపీకి రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు వేముల వీరేశం, గువ్వల బాలరాజు మండి పడ్డారు. ఆ పార్టీలో ఉన్న రేవంత్‌ రెడ్డి రైతుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో వారిద్దరూ మాట్లాడారు.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరును దేశమంతా ప్రశంసిస్తోందని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై కన్నా చంద్రబాబు యావే రేవంత్‌ రెడ్డిలో ఎక్కువగా కనిపిస్తోందని విమర్శించారు. రేవంత్‌ తెలంగాణ అసెంబ్లీలో బాబు భజన చేస్తామంటే ఎలా ఒçప్పుకుంటామని ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణకు రేవంత్‌ ద్రోహం చేస్తున్నాడని వారు దుయ్యబట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement