'పదవి కోసమే కేసీఆర్ పై రేవంత్ విమర్శలు'
హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ నాయకత్వాన్ని దక్కించుకునేందుకు ఆపార్టీ నేత రేవంత్ రెడ్డి అదే పనిగా సీఎం కేసీఆర్ ను విమర్శిస్తున్నారని ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షిస్తున్న టీడీపీ నేతలను తెలంగాణ ప్రజలు క్షమించదని ఆయన అన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషిని గుర్తించే తెలంగాణ టీడీపీ నేతలు టీఆర్ఎస్ లో చేరుతున్నారని బాలరాజు తెలిపారు. టీఆర్ఎస్ లోకి వచ్చే టీడీపీ నేతల వలసలను ఆపడం రేవంత్ రెడ్డికి చాతకాదని బాలరాజు అన్నారు. తెలంగాణలో ఉనికిని కాపాడుకునేందుకే టీడీపీ బస్సు యాత్ర చేస్తున్నారని బాలరాజు విమర్శించారు.