పులి కాస్తా పిల్లి కావడమంటే ఇదే...! | assembly meetings special story | Sakshi
Sakshi News home page

పులి కాస్తా పిల్లి కావడమంటే ఇదే...!

Published Sun, Mar 20 2016 1:27 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

పులి కాస్తా పిల్లి కావడమంటే ఇదే...! - Sakshi

పులి కాస్తా పిల్లి కావడమంటే ఇదే...!

గత అసెంబ్లీ సమావేశాలతో పోల్చితే ప్రస్తుత సమావేశాల్లో పలు ఆసక్తికరమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో టీడీపీ సభ్యులు చేసిన హడావుడి అంతా ఇంతా కాదని, ప్రధానప్రతిపక్షం కాంగ్రెస్‌ను కూడా వెనక్కు తోసి తామే అసలైన విపక్షంగా ప్రవర్తించిన తీరును పలువురు ఎమ్మెల్యేలు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు  టీడీపీ నుంచి మెజారిటీ ఎమ్మెల్యేలు విడిపోయి టీఆర్‌ఎస్‌లో విలీనమయ్యాక కూడా కొందరు ఎమ్మెల్యేలు ఏమాత్రం వెనక్కుతగ్గడం లేదంటున్నారు. తామే అసలైన అధికారపక్షంగా టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలనే పక్కకు తోసే విధంగా వారు చూపుతున్న వేగం చూసి ఇతర ఎమ్మెల్యేలు ముక్కున వేలేసుకుంటున్నారు.

గతంలో ఆయా సందర్భాల్లో బయట బహిరంగంగానే రేవంత్‌రెడ్డి మీసం మేలేసి తొడగొట్టి సవాళ్లు విసిరిన విషయాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారట. ఓటుకు కోట్లు కేసులో జైలు నుంచి రేవంత్ బెయిల్‌పై బయటకొచ్చాక టైగర్ ఈజ్ బ్యాక్ అంటూ గతంలో ఫ్లెక్సీలు, పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో మొత్తం ముగ్గురు ఎమ్మెల్యేల్లో రేవంత్‌రెడ్డి, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కలసి కనిపిస్తున్నారు. అధిక సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ఒక్కడే ఏక్‌నిరంజన్ అన్న చందంగా లాబీల్లో అటు ఇటు తిరుగుతూ కనిపిస్తున్నారు. ఎవరు వెంట లేకపోవడంతో మీడియా ప్రతినిధులతో పిచ్చాపాటి, గత అనుభవాలు, సంఘటనలను గుర్తుచేసుకుంటూ రే వంత్‌రెడ్డి గడిపేస్తున్నారట. ఒకప్పుడు పులి ఇప్పుడు పిల్లి అనే సామెతకు ఇది అతికినట్లుగా సరిపోతుందని పలువురు ముక్తాయింపునిచ్చేస్తున్నారు...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement