
అచ్చెన్నాయుడుపై సభాహక్కుల ఉల్లంఘన నోటీసు
ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును వైఎస్ఆర్ సీపీ ఇచ్చింది.
హైదరాబాద్ : ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును వైఎస్ఆర్ సీపీ ఇచ్చింది. వైఎస్ఆర్ సీపీపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు స్పీకర్ కోడెల శివప్రసాద్రావుకు అచ్చెన్నాయుడుపై ఉల్లంఘన నోటీసులు సమర్పించారు. గౌరవప్రదమైన మంత్రి పదవిలో ఉండి కూడా.. వైఎస్ఆర్ సీపీని సైకో పార్టీ అంటూ సభలో అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. మంత్రి తీరుపై సభలో ఉన్న వైఎస్ఆర్ సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా సభా కార్యక్రమాలను ఆ పార్టీ అడ్డుకోంది.