
పజా సమస్యలను ప్రస్తావిస్తాం: కిషన్‌రెడ్డి
అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారమార్గాలను సూచించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది.
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించి వాటికి పరిష్కారమార్గాలను సూచించాలని బీజేపీ శాసనసభాపక్షం నిర్ణయించింది. ఈ సందర్భంగా మొత్తం 20సమస్యలను ప్రస్తావించాలని నిర్ణయించినట్లు బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానంగా సెప్టెంబర్ 17ను రాష్ట్ర విమోచన దినంగా అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో పాటు, జిల్లాల పునర్విభజన ప్రతిపాదనలు, వాటితో ముడిపడిన సమస్యలు, మహారాష్ట్రతో ఒప్పందంపై తమ వాదనను వినిపిస్తామని చెప్పారు.