హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల
విమోచన దినంపై బీజేపీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల తొలిరోజున బీజేఎల్పీ డిమాండ్ చేయనుంది. టీఆర్‌ఎస్ గతంలో ప్రజలకిచ్చిన హామీ మేరకు ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించింది.
ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే వరకు పార్టీపరంగా ఉద్యమాన్ని కొనసాగించాలని తీర్మానించినట్లు బీజేపీ ఒక ప్రకటనలో పేర్కొంది. మంగళవారం ఉదయం 10 గంటలకు అసెం బ్లీ ఎదుటనున్న మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్‌పటేల్ విగ్రహానికి పార్టీ ఎమ్మెల్యేలు పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు.