మొదట వైఎస్‌ జగన్‌ ప్రమాణం.. తరువాత చంద్రబాబు | AP Assembly Meeting Will Be Start On Tomorrow Says Gadikota Srikanth | Sakshi
Sakshi News home page

మొదట వైఎస్‌ జగన్‌ ప్రమాణం.. తరువాత చంద్రబాబు

Published Tue, Jun 11 2019 1:01 PM | Last Updated on Tue, Jun 11 2019 1:26 PM

AP Assembly Meeting Will Be Start On Tomorrow Says Gadikota Srikanth - Sakshi

సాక్షి, అమరావతి: తొలి క్యాబినెట్‌ సమావేశంతోనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశమంత ఎత్తుకి ఎదిగారని ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోను అమలు చేసే విధంగా తొలి క్యాబినెట్ సమావేశంలోనే చర్యలు తీసుకోవడం గర్వకారణన్నారు. మంగళవారం అమరావతిలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఏపీ అసెంబ్లీ తొలి సమావేశాలు రేపటి నుంచి ప్రారంభవుమతాయని వెల్లడించారు.

తొలుత సీఎం వైఎస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తారని, అనంతరం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తారని తెలిపారు. గురువారం స్పీకర్‌ ఎన్నిక ఉంటుందని, 14న ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగిస్తారని చెప్పారు. సభను ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తామని శ్రీకాంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. గత స్పీకర్, ప్రభుత్వంలా కాకుండా హుందాగా నిర్వహిస్తామన్నారు.  ప్రతిపక్షాన్ని కూడా గౌరవించి సభలో అవకాశం ఇస్తామన్నారు. గత ప్రభుత్వంలో ప్రతిపక్ష సభ్యులకు ఛాంబర్ కూడా ఇవ్వకుండా హేళన చేశారని, తమ ప్రభుత్వంలో అందరికీ సరైన ప్రాధాన్యం కల్పిస్తామని పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement