
సాక్షి, విజయవాడ: అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నామని చంద్రబాబు కొత్త డ్రామా మొదలు పెట్టారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కరోనాకు భయపడి హైదరాబాద్ నుంచి రావటం ఇష్టంలేక డ్రామా ఆడుతున్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఒక్కపూట జరిగినా ప్రతిపక్ష నేతగా ఉపయోగించుకోవాలని ఆయన హితవు పలికారు. ‘‘రఘరామను అరెస్ట్ చేస్తే చంద్రబాబు గగ్గోలు పెట్టారు. రఘురామను తాబేదారుగా మార్చుకుని ప్రభుత్వంపై కుట్ర పన్నారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నాలు చేస్తున్నారని’’ ఎమ్మెల్యే జోగి రమేష్ నిప్పులు చెరిగారు.
చదవండి: రఘురామకృష్ణరాజు వ్యాఖ్యల వెనుక కుట్ర కోణం: సజ్జల
ఏపీ అసెంబ్లీ సమావేశాలు: మొహం చాటేసిన చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment