ప్రభుత్వ ఆప్రజాస్వామిక తీరును నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరుకాని నేపథ్యంలో.. శుక్రవారం నుంచి ప్రారంభమైన రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో తొలిరోజు కీలకమైన ప్రజాసమస్యల ప్రస్తావనేదీ లేకుండానే ముగిసింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. రైతులు, డ్వాక్రా రుణాల మాఫీ చేయాలని..