ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు.
అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు.
ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే..
Comments
Please login to add a commentAdd a comment