both
-
‘కుప్టి’కి నిధులు కేటాయించేలా చూస్తా..
ఆదిలాబాద్: బోథ్ నియోజకవర్గంలో ప్రాజెక్టులు, మారుమూల గ్రామాలకు బీటీ రోడ్ల నిర్మాణాల కోసం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు బోథ్ ఎమ్మెల్యే అనిల్‌జాదవ్ తెలిపారు. నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుప్టి ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని తెలిపారు. అటవీశాఖ అనుమతులు ఇవ్వకపోవడంతో నియోజకవర్గంలో పలు రోడ్ల పనులు మధ్యంతరంగా నిలిచి పనులు ముందుకు సాగడంలేదని పేర్కొన్నారు. దీంతోని యోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నియోజకవర్గలో నూతనంగా మరో 20 చెరువుల మంజూరు కోసం అసెంబ్లీలో ప్రస్తావిస్తానని తెలిపారు. సాగునీరు, రోడ్ల సౌకర్యాల ఏర్పాటు కోసం అసెంబ్లీలో ప్రస్తావించనున్నట్లు పేర్కొన్నారు. ఇవి చదవండి: తెలంగాణ అసెంబ్లీ: గవర్నర్ తమిళిసై ప్రసంగం ఇదే.. -
పోలీసులు కావలెను!
నేరడిగొండ(బోథ్) : ప్రజలకు రక్షణ కల్పించేందుకు ఏర్పాటు చేసిన పోలీస్‌స్టేషన్‌లో సరిపడా సిబ్బంది లేక పూర్తిస్థాయిలో సేవలు అందించడం లేదు. నేరడిగొండ పోలీసు స్టేషన్లో 12 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో ప్రజలకు సరైన సమయంలో తగిన సేవలు అందకుండా పోతున్నాయి. మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్లో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొత్తం 30 మంది సిబ్బంది ఉండాలి. అందులో ఒక ఎస్సై, ముగ్గురు ఏఎస్సైలు, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లతో పాటు 21 మంది కానిస్టేబుళ్లు ఉండాలి. అలా పూర్తిస్థాయిలో సిబ్బంది ఉంటే మండల వ్యాప్తంగా ఉన్న 14 గ్రామపంచాయతీల్లో సుమారు 30 వేలకు పైగా ఉన్న జనాభాకు సరైన సమయంలో రక్షణ కల్పించడంతో పాటు ఎలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగకుండా అడ్డుకోగలుగుతారు. కానీ ప్రస్తుతం ఆ స్టేషన్లో 12 మంది మాత్రమే ఉన్నారు. అందులో ఒక ఎస్సై, ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, 8 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. మిగితా సిబ్బంది కొందరు డిప్యూటేషన్లపైన వివిధ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నారు. రోజువారీ పనులే అధికం. డిప్యూటేషన్‌పై వెళ్లిన వారితో పాటు ఖాళీగా ఉన్న పోస్టులు మిగిలిన 12 మందిలో ఒకరు కోర్టు డ్యూటీ, మరొకరు రైటర్‌గా పనిచేస్తుండగా, ఇంకొకరు ఫిర్యాదులు తీసుకునేందుకు నిత్యం స్టేషన్లో ఉండాల్సి వస్తోంది. మిగిలిన 8 మంది, ఎస్సైతో పాటు ముగ్గురు హెడ్ కానిస్టేబుళ్లు, ఐదుగురు పోలీసులు ఉన్నారు. వీరితో మాత్రమే మండల ప్రజలకు రక్షణ కల్పించాల్సి వస్తోంది. దీంతో వారికి నిత్యం పనితప్ప ఏ ఒక్క గంట తీరిక దొరకడం లేదు. అందులోనే అప్పుడప్పుడు జాతీయ రహదారి గుండా మంత్రులు, వివిధ ప్రజాప్రతినిధులు వెళ్తుండడంతో వారిని పంపించడంలో కొంత సమయం కోల్పోతున్నారు. దీంతోపాటు జిల్లా కేంద్రాల్లో, హైదరాబాద్‌లో జరిగే పలు ఉత్సవాలు, పార్టీ సభలకు ఇక్కడి నుంచి ఎస్సైతో పాటు సిబ్బందిని బందోబస్తుకు పంపిస్తున్నారు. దీంతో మండల ప్రజలకు పోలీసుల సేవలు అందకుండా పోతున్నాయి. ఏదైనా దరఖాస్తులు ఇస్తే సిబ్బంది సరిపడా లేని కారణంగా రెండుమూడు రోజులు స్టేషన్ చుట్టూ తిరిగి తగవులు పరిష్కరించుకోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ప్రజలకు సరైన సమయంలో పోలీసు సేవలు అందించేందుకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. ఉన్నతాధికారులకు విన్నవించాం స్టేషన్లో సరిపడా సిబ్బంది లేని విషయాన్ని అనేకమార్లు ఉన్నతాధికారులకు విన్నవించాం. 16 మంది కానిస్టేబుళ్లు ఉండి ఉంటే ప్రజలకు అవసరమైన సేవలు వెంటనే అందించేవాళ్లం. ఇప్పటికీ కొంత ఇబ్బందవుతున్నా మెరుగైన సేవలందిస్తున్నాం. ప్రస్తుతం ఐదుగురు సిబ్బంది మాత్రమే ఉండడంతో ఇబ్బందులు కలుగుతున్నాయి. త్వరలోనే కొత్త సిబ్బందిని నియమిస్తామని అధికారులు చెబుతున్నారు. -
కలరా కలవరం
బోథ్‌లో బయటపడ్డ వైనం రిమ్స్, స్థానిక ఏరియా ఆస్పత్రిలో నిర్ధారణ పరీక్షలు నమూనాలు సేకరించిన వైద్య, ఆరోగ్యశాఖ క్లోరినేషన్ లేకపోవడంతోనే కలరా వ్యాప్తి ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లాలో కలర కలవర పెడుతోంది. వర్షాకాలంలో ప్రతి ఏడాది అతిసారం, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రజలను భయపెట్టేవి. తాజాగా జిల్లాలో కలరా వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే బోథ్ సివిల్ ఆస్పత్రిలో 20 మంది కలరా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. బోథ్‌లో కలర వ్యాప్తి చెందినట్లు ప్రచారం కావడంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల, ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. దీంతో ముందస్తుగా కలరాను గుర్తించి వ్యాధి నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగా బుధవారం కలెక్టర్ జగన్మోహన్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి జలపతినాయక్తో కలిసి బోథ్ ఆస్పత్రిని తనిఖీ చేసి వివరాలు తెలుసుకున్నారు. నిర్ధారణకు ఆస్పత్రి నుంచి 30 నమూనాలు సేకరించారు. బోథ్ ఆస్పత్రితోపాటు, జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రిలో నిర్ధారించేందుకు నమూనాలను బుధవారం పంపించారు. గురువారం ఈ పరీక్షల ఫలితాలు రానున్నాయి. క్లోరినేషన్ లేకపోవడంతోనే.. గ్రామాలు, కాలనీల్లో అపరిశుభ్రమైన కాలుష్యం, కలుషితమైన తాగునీటితో కలర వ్యాధి వస్తుంది. వర్షకాలంలో వర్షం నీరు రావడంతో నీటికాలుష్యం ఏర్పడుతుంది. ముఖ్యంగా తాగునీటినిలో క్లోరినేషన్ లేకపోవడం ప్రధాన కారణం. ప్రస్తుతం బోథ్‌తోపాటు కౌఠ–బి, పొచ్చెర, ధన్నోర వంటి గ్రామాల్లో పర్యటించిన అధికారులు ప్రజలు కలుషిత నీరు తాగుతుండడం, అపరిశుభ్రత వాతావరణం ఉండడంతో వాంతులు, విరేచనాలతో ఆస్పత్రిలో చేరుతున్నట్లు గుర్తించారు. బోథ్ ఆస్పత్రికి కలరా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఆయా గ్రామాల్లో క్లోరినేషన్ మొదలుపెట్టారు. కౌఠ–బిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కాగా.. గిరిజన ప్రాంతాలైన జైనూర్, నార్నూర్, సిర్పూర్, ఉట్నూర్, కాగజ్‌నగర్, కౌటాల, చెన్నూర్ వంటి మండలాల్లోని మారుమూల గిరిజన ప్రాంతాల్లో పారిశుధ్యం లోపించింది. ఎక్కడ చూసినా మురికి గుంతలు, వాటిలో పేరుకుపోయిన దోమలతో వాతావరణం కలుషితమవుతోంది. దీనికితోడు ప్రజలు కలుషిత నీరు తాగుతుండడంతో వ్యాధుల బారిన పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కలరా వ్యాప్తి చెందకముందే తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వర్షాకాలంలో ముందస్తుగా జాగ్రత్తగా తాగునీటిన క్లోరినేషన్ చేయాల్సిన పంచాయతీరాజ్ శాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేయకపోవడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తెలుస్తోంది. దీంతోపాటు ఆయా పీహెచ్‌సీలకు మందులు సరఫరా చేసి, ముందస్తుగా అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాం.. – జలపతినాయక్, వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కలరా వ్యాధి లక్షణాలు కనిపించడంతో నివారణ చర్యలు చేపట్టాం. ఇందులో భాగంగానే బోథ్‌లోని కౌఠలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశాం. మందుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలి. ప్రజలు అపరిశుభ్ర వాతారణం లేకుండా చూసుకోవాలి. క్లోరినేషన్ చేసిన నీటిని మాత్రమే తాగాలి. -
అదిలాబాద్ జిల్లా బోథ్‌లో ఉద్రిక్తత
స్థానికంగా ఉన్న మున్సిపల్ కోర్టును ఎచ్చోడకు తరలించాలనుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాని కోరుతూ అదిలాబాద్ జిల్లా బోథ్ వాసులు రోడ్డెక్కారు. మున్సిపల్ కోర్టును తరలించేందుకు న్యాయమూర్తి చేస్తున్న ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు బోథ్ బంద్‌కు పిలుపు నిచ్చారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఎటువంటి అవాంఛనీయ చర్యలు జరగకుండా ఏర్పాట్లు చేశారు. భారీగా పోలీసులను మొహరించారు. -
మెడికల్ కౌన్సిలింగ్ తేదీలు ఖరారు
-
లోక్‌సభలో హోరాహోరీ