
ఏకపక్షంగా అసెంబ్లీ సమావేశాలు: భట్టి
సాక్షి, హైదరాబాద్: ప్రజాసమస్యలపై చర్చించకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రభుత్వం ఏకపక్షంగా నడిపిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మండిప డ్డారు. శనివారం గాంధీభవన్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘ఆపరేషన్ సక్సెస్... పేషెంట్ డెడ్’ అన్నట్టుగా సమావేశాలు జరిగాయన్నారు. టీఆర్‌ఎస్ గొప్పలను చెప్పుకోవ డానికి తప్ప ప్రజా సమస్యలను చర్చించలేదన్నారు.
94 గంటలపాటు సమావేశాలు జరిగితే 50 గంటలపాటు టీఆర్‌ఎస్ వాళ్లే మాట్లాడారన్నారు. రైతు రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ వంటి పథకాలపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిం దని అన్నారు. జీహెచ్‌ఎంసీలో అవినీతిపై ప్రశ్నిస్తే సమాధానమే ఇవ్వలేదన్నారు.