
బెంగళూర్ మెట్రోలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో రాహుల్ సెల్ఫీ
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా బెంగళూర్ మెట్రోలో కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ సెల్ఫీలపై బీజేపీ చురకలు వేసింది. ‘మెట్రో టికెట్ కౌంటర్ వద్ద సెల్ఫీలు తీసుకోవడం...సంపన్నుల బిడ్డలే సామాన్యుల జీవితాలతో ఇలా ఆడుకుంటా’రని కర్ణాటక బీజేపీ ట్వీట్ చేసింది. జనాశీర్వాద్ యాత్రలో భాగంగా రాహుల్ ఆదివారం బెంగళూర్‌లో ప్రచార సభలతో హోరెత్తించారు. బెంగళూర్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణీకులతో ముచ్చటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యతో పాటు ప్రయాణీకులతో సెల్ఫీలు దిగారు.
బీజేపీపాలిత రాష్ట్రాలతో పోలిస్తే కాంగ్రెస్ పాలిత కర్ణాటకకు కేంద్ర ప్రభుత్వం తక్కువ నిధులను కేటాయిస్తోందని ఆరోపించారు. వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్, బీజేపీలు భారీస్ధాయిలో ప్రచారం చేపట్టాయి.