బీజేపీ, కాంగ్రెస్‌ ట్వీట్‌ వార్‌ | BJP Addresses Congress President As 'Oye' Rahul  | Sakshi
Sakshi News home page

బీజేపీ, కాంగ్రెస్‌ ట్వీట్‌ వార్‌

Mar 28 2018 12:38 PM | Updated on Aug 25 2018 6:31 PM

BJP Addresses Congress President As 'Oye' Rahul  - Sakshi

ఫైల్‌ఫోటో


సాక్షి, బెంగళూర్‌ : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య వాడివేడిగా మాటల దాడి కొనసాగుతోంది. ట్విటర్‌ వేదికగా పరుష పదజాలంతో విమర్శలు కురిపిస్తుండటం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా పొరపాటుగా వాడిన పదం రాహుల్‌కు ప్రచారాస్త్రమైంది. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌ అత్యంత అవినీతిమయ ప్రభుత్వమని అమిత్‌ షా నోరుజారడంతో దీన్ని కాంగ్రెస్‌ అవకాశంగా మలుచుకుంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని అద్భుతంగా ఆరంభించేందుకు తమకు బీజేపీ చీఫ్‌ బహుమతి అందించారని రాహుల్‌ ట్వీట్‌ చేశారు. దీనిపై బీజేపీ స్పందిస్తూ పొరపాటున నోరుజారిన అంశాన్ని ప్రచారానికి కీలకంగా తీసుకోవడంలోనే మీ చౌకబారుతనం అర్థమవుతోందని దీటుగా కౌంటర్‌ ఇచ్చింది. ఈ క్రమంలో బీజేపీ కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ను ఉద్దేశించి వాడిన ఓయ్‌ అనే పదం వివాదాస్పదమైంది. జాతీయ పార్టీ అధ్యక్షుడిని ఉద్దేశించి ఆ పదం వాడటం సరైంది కాదని పలువురు నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. 



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement