అంబరీష్(ఫైల్)
సాక్షి, కర్ణాటక(శివాజీనగర): మండ్య కాంగ్రెస్ అభ్యర్థి అంబరీష్ నేతలకు చుక్కలు చూపుతున్నారు. టికెట్ ప్రకటించినా ‘బీ ఫారం’ అందుకోని ఈయన పలు షరతులతో నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. బీ ఫారం తీసుకోవాలంటే మండ్య జిల్లా ఎన్నికల ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించాలని, పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇవ్వాలనే తదితర షరత్తులు విధించటంతో కాంగ్రెస్ నేతలకు దిక్కుతోచడం లేదు.
ఈ క్రమంలో కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్, ముఖ్యమంత్రి సిద్ధారామయ్యల సూచన మేరకు బెంగళూరు నగరాభివృద్ధి మంత్రి కేజే జార్జ్ బుధవారం అంబరీష్‌ను కలిసి బీఫారం తీసుకునేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. శుక్రవారం రాష్ట్ర ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్ అంబరీష్‌ను కలిసి చర్చలు జరుపనున్నారు. అంబరీష్ డిమాండ్లను ఆమోదిస్తారో లేదో అనేది కుతూహలంగా మారింది. ఇదిలా ఉండగా అంబరీష్ ఇంటికి బీ ఫారం పంపుతామని కేపీసీసీ అధ్యక్షుడు డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. మరో వైపు నాయకులు, కార్యకర్తలు అంబరీష్‌ను కలిసి నియోజకవర్గానికి రావాలని, మీ వెంట మేం ఉంటామని, నామినేషన్ దాఖలు చేయాలని ఒత్తిడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment